25న ముస్సోరికి వెళ్లనున్న చంద్రబాబు నాయుడు

అఖిల భారత సర్వీసుల శిక్షణా సంస్థ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాలని, వారికి మార్గనిర్దేశం చేయాలని బాబును ఆహ్వానించారు. ఈ వివరాలను ఏపీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఈనెల 25న ముస్సోరికి వెళుతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలోని పాలనా సంస్కరణలపై ఐఏఎస్ లతో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇన్-సర్వీస్ ఐఏఎస్ లు, శిక్షణలో ఉన్న ఐఏఎస్ లతో జాయింట్ సెషన్లో చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
chandrababu
ap cm
chandrabu mussori trip
chandrababu session with trainee ias officers

More Telugu News